ఓపక్క వరుస ఓటములు.. మరోపక్క టీమిండియా క్రికెటర్ల షికార్లు..!(వీడియో)
కాకతీయ, స్పోర్ట్స్, 2025 అక్టోబర్ 25: ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లను కోల్పోయిన టీమిండియా.. కనీసం చివరి మ్యాచ్‌లో అయినా గెలిచి వైట్‌వాష్‌ను తప్పించుకోవాలనుకుంటోంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆఖరి పోరు శనివారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. అయితే సిరీస్‌ను కోల్పోవడంతో ఓ వైపు మైదానంలో ఓటమి నిరాశ వాతావరణం నెలకొనగా, మరో వైపు కొంతమంది యువ క్రికెటర్లు మాత్రం షికార్లలో మునిగిపోయారు. అడిలైడ్‌లో జరుగుతున్న...