పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం సైకిల్ ర్యాలీ

కరీంనగర్ వీధుల్లో సీపీ గౌష్ ఆలం రైడ్ కాకతీయ, కరీంనగర్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం 20 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీని నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి ర్యాలీని కమిషనర్ గౌష్ ఆలం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు అందరికీ స్ఫూర్తి కావాలన్నారు. ఈ ర్యాలీలో కరీంనగర్ రన్నర్స్, సైక్లిస్ట్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు, డాక్టర్లు, పౌరులు...