రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందజేయాలి
కాకతీయ, హుజురాబాద్: రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందజేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం తహశీల్దార్ కనుకయ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను చెల్లించాలని డిమాండ్ చేశారు. చాలామంది ఉద్యోగులు పదవీ విరమణ పొంది చాలా కాలం అవుతున్నా వారికి రావాల్సిన గ్రాట్యుటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్, కమ్యుటేషన్, సరెండర్ లీవులు వంటి...