కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
కాకతీయ, ఆదిలాబాద్: అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం సందర్భంగా గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన కళాకారులు మేశ్రమ భగవాన్ దాస్, రాములును శాలువతో సత్కరించారు. శనివారం ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం డైరెక్టర్, కళాకారుడు కాత్లే శ్రీధర్ మాట్లాడారు. ఆదివాసీ బిర్ధ్ గోండు జాతికి చెందిన కిక్రీ వాయిద్యాకారులు మేశ్రం భగవాన్ దాస్, సెడ్మకి రాములు కిక్రి వాయిద్యాన్ని నేర్చుకొని అదే వృత్తిగా జీవనాన్ని సాగిస్తున్నారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుండి వారికి ఎలాంటి లబ్ది కలుగలేదు. మరి కొంతమంది కళాకారులు పెప్రే...