గర్జిస్తున్న పోలీసు తుపాకి..!
గర్జిస్తున్న పోలీసు తుపాకి..! కాకతీయ, హైదరాబాద్ : వారం రోజుల్లోనే రెండు సార్లు తెలంగాణ తుపాకీ గర్జించింది. మొన్న నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రౌడీ షీటర్ షేక్ రియాజ్‌ను మట్టు బెట్టిన గన్.. తాజాగా హైదరాబాద్ లో మరో రౌడీ షీటర్ మహ్మద్ ఒమర్ అన్సారీపై దండెత్తింది. వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు సంఘటనలు తెలంగాణ పోలీసుల ధైర్యసాహసాలకు, త్వరితగత చర్యలకు అద్దం పడుతున్నాయి. రౌడీ షీటర్లను బెంబేలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు తీరుపై ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు....