భక్త మార్కండేయ స్వామి ఆలయంలో ఘనంగా అభిషేకాలు

కాకతీయ, నెల్లికుదురు: కార్తీక మాసం సందర్భంగా మండలంలోని శ్రీశివపార్వతి భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో అర్చకులు వెలుకూచి నాగయ్య శాస్త్రి ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి నాగయ్య శాస్త్రి మాట్లాడుతూ నవంబర్ 2న సామూహిక సత్యనారాయణ వ్రతాలు, 5న ఉదయం సామూహిక అభిషేకాలు, సాయంత్రం ఐదున్నరకు కార్తీక పౌర్ణమి రోజున దీపోత్సవ కార్యక్రమం, 14న ఉదయం 9 గంటలకు శుక్రవారం మహిళ భక్తులతో సామూహిక కుంకుమార్చన జరుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వేముల సుధాకర్, డాక్టర్...