గంజాయి తరలిస్తున్న వ్యక్తుల పట్టివేత

కాకతీయ, నూగూరు వెంకటాపురం: గంజాయిని తరలిస్తున్నారని ఎస్సై కొప్పుల తిరుపతికి తగిన సమాచారం అందడంతో సిబ్బందితో నూగూరు శివారు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అతివేగంగా దూసుకొస్తున్న ఒక మూడు బైకులను గమనించారు. మొదటగా బైక్ పై వచ్చిన వారిని ఆపి వివరాలు సేకరిస్తుండగా వెనక వస్తున్న బైకు పై ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి మోటార్ సైకిల్ ను వెనుకకు తిప్పి వేగం పెంచడంతో అదుపు తప్పి కింద పడ్డారు. వారి వద్ద ఉన్న బ్యాగ్ ను వదిలిపెట్టి పక్కనే...