గత పాలకుల నిర్లక్ష్యంతోనే వెనుకబాటు

పరకాల పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాలి పట్టణ సుందరీకరణే నా లక్ష్యం.. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి. కాకతీయ, పరకాల: పట్టణంలోని పలు వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరకాల పట్టణం ముంపుకు గురి కాకుండా ప్రణాళికా బద్ధంగా సుందరీకరణ చేస్తామని అన్నారు. టీయూఎఫ్ ఐడీసీ నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అన్నారు. గతంలో వచ్చిన నిధులు నిరుపయోగం...