బాలికల వాష్‌రూమ్‌లో కెమెరాలు?
గంగాధర ప్రభుత్వ పాఠశాలలో దారుణ సంఘటన సోమవారం వెలుగులోకి ఘటన.. విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ప్రభుత్వ పాఠశాలలో బాలికల వాష్‌రూమ్‌లో కెమెరాలు అమర్చి వీడియోలు చిత్రీకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థినులు అనుమానాస్పద పరికరాన్ని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. ఆగ్రహంతో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అధికారులు ఘటన స్థలాన్ని సందర్శించి విచారణ ప్రారంభించారు....