మొక్క‌జొన్న కొనుగోళ్లు చేప‌ట్టాలి

గ‌త ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు కొనుగోలు చేసేది ఈ ప్ర‌భుత్వం క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేదు సోనాల మండ‌లంలో జాతీయ ర‌హ‌దారిపై రైతుల ధ‌ర్నా రోడ్డుపైనే వంట‌వార్పు నిర్వ‌హించిన నిర‌స‌న‌ కాకతీయ, ఆదిలాబాద్ : మొక్క‌జొన్న కొనుగోళ్ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం వెంట‌నే చేప‌ట్టాల‌ని ఆదిలాబాద్ జిల్లా సోనాల మండ‌ల రైతులు నిర‌స‌న‌కు దిగారు. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్రంలో సోమ‌వారం సోయా, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల‌ను ప్రారంభించాలని రైతులు ధర్నాను చేప‌ట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు పండించిన సోయా...