దళారులను నమ్మి మోసపోవద్దు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్దతు ధర పొందాలి తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి వెల్లడి కాకతీయ తుంగతుర్తి : రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నల్గొండ జిల్లా తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని వెలుగుపల్లి మరియు గొట్టిపర్తి గ్రామాలలో నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్, ఆధ్వర్యంలో నిర్వహించిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల కల్లాల వద్ద 17% తేమ...