అనవసర పరీక్షలతో ప్రజలను భయపెట్టొద్దు

డీఎం హెచ్ఓ గోపాల్ రావు కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు స్వయంగా పస్రా గ్రామంలోని కేర్, వినాయక డయాగ్నోస్టిక్ సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న ల్యాబుల రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులు, రిపోర్టులను సవివరంగా పరిశీలించారు. ల్యాబ్ యజమాన్యంతో మాట్లాడుతూ అవసరం లేని పరీక్షలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయరాదని, ఆర్థికంగా నష్టపరచకూడదని, పరీక్షల ధరల పట్టికను ల్యాబ్ ముందు...