నిరంతర విద్యుత్ సరఫరాకు కృషి
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కాకతీయ, గీసుగొండ: గ్రామాల్లో లో వోల్టేజీ సమస్యలు రాకుండా వ్యవసాయానికి, గృహాలకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందించడానికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మండలంలోని విశ్వనాధపురం, మొగిలిచర్ల గ్రామాలలో నిర్మాణంలో ఉన్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణ పనులను ఎమ్మెల్యే రేవూరి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణ పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో లో వోల్టేజ్ సమస్య...