రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
జడ్పీ సీఈవో రాంరెడ్డి కాకతీయ, రాయపర్తి : రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని వరంగల్ జడ్పీ సీఈవో, ఇంచార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం, కొలనుపల్లి, కొండూరు, మైలారం గ్రామాలలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడారు. ధాన్యం విక్రయించడానికి వచ్చిన రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ధాన్యాన్ని తప్పకుండ తుర్పార పట్టించి సకాలంలో కాంటాలు నిర్వహించాలని ఐకేపీ సిబ్బందికి సూచించారు....