ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
జడ్పీ సీఈఓ పురుషోత్తం, ఆర్డీవో కృష్ణవేణి కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులను జడ్పీ సీఈఓ పురుషోత్తం, మానుకోట ఆర్డీవో కృష్ణవేణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సీ.ఈ.ఓ, ఆర్డీవోతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామానికి చెందిన కొండా భారతమ్మ తనకున్న సర్వే నెంబర్ లో భూమి సరిహద్దుల నిర్ణయించాలని విన్నవించారు. కేసముద్రం గ్రామానికి చెందిన పొదిల వెంకట్ రెడ్డి వృద్ధాప్యంలో ఉన్న తనను...