రాష్ట్రంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాక‌తీయ‌, కరీంన‌గ‌ర్ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతోందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. సోమవారం గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి దాదాపు రూ.800 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. సింగరేణి, ప్రభుత్వ నిధులతో రామగుండంను రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ...