సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ రాజర్షి షా కాకతీయ ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్‌ (సీఎంఆర్) సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులు, రైస్ మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సి.ఎం.ఆర్ సరఫరా పురోగతిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సన్నబియ్యం మిల్లింగ్, సరఫరా పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సివిల్ సప్లై కమిషనర్ నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం మిల్లర్లు సి.ఎం.ఆర్ సరఫరా చేయకపోతే...