కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులుండొద్దు
కాకతీయ కొత్తగూడ : ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ పై కొత్తగూడ మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో మంగళవారం తహసీల్దార్ రాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలని పలు సూచనలు చేశారు . ధాన్యం మద్దతు ధర రైతులకు అర్థమయ్యే విధంగా తెలియజేసే బోర్డులను కొనుగోలు కేంద్రాల వద్ద తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. వరి ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు, టార్పలీన్ లు, తాగునీటి...