మాజీ మంత్రి హరీష్‌రావుకు పితృవియోగం
మాజీ మంత్రి హరీష్‌రావుకు పితృవియోగం కాకతీయ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు కొద్ది సేపటి క్రితం మృతి చెందారు. వయోభారం, అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సత్యనారాయణ రావు కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మరణంతో తన్నీరు కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు ఆలుముకున్నాయి. హైదరాబాద్‌లోని క్రిన్స్‌విల్లాస్‌లో సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. హరీష్‌రావుకు పితృవియోగంపై పలువురు బీఆర్‌ఎస్ నేతలు, రాజకీయ...