గుడిసె వాసులకు పట్టాలిచ్చి ఇండ్లు నిర్మించండి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య కాకతీయ, ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ మండలం జక్కలొద్దీ గుడిసె సెంటర్ లో సీపీఎం అధ్యక్షుడు రామ సందీప్ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.నాగయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జక్కలొద్దీ గుడిసె సెంటర్ ఏర్పాటు చేసి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అవుతోందన్నారు. ఇప్పటివరకు దానిని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. గుడిసెల్లో నివసిస్తున్న వారంతా...