కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాకతీయ, నడికూడ : నడికూడ మండలం రామకృష్ణాపురం గ్రామంలో పౌర సరఫరాల సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (ఐకేపీ) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలన్నారు. కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు...