లైంగిక వేధింపుల్లో హెచ్ఎం, సిబ్బంది పాత్రపై విచారణ

అవసరమైతే వారిపైనా పోక్సో కేసు నమోదు చేయాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో అటెండర్ యాకూబ్ పాషా విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐదు రోజులుగా లోతైన విచారణ జరిపి నివేదిక సమర్పించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పోక్సో కేసు కావడంతో బాధిత విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అధికార యంత్రాంగం జాగ్రత్తగా వ్యవహరిస్తోందన్నారు. ఈ...