నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి కార్తీక పూజలు

కాకతీయ, గీసుగొండ : నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి కార్తీక మాస ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలో ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన ఊకల్ శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు ఆధ్వర్యంలో పూజాధికాలు నిర్వహించారు. ఈ మేరకు కార్తీకమాసం మొదటి మంగళవారాన్ని పురస్కరించుకొని స్వామివారికి వైదిక మంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక అభిషేకము, పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అనంతరం వివిధ రకాల పూలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో...