సామాజిక సమస్యలపై పోలీసుల ‘కళాజాత’
కాకతీయ, బయ్యారం : మండలంలోని వెంకట్రాంపురం గ్రామంలో మూఢనమ్మకాలు, మహిళలపై అత్యచారాలు, వేధింపులు, డయల్100, బాణామతి తదితర అంశాలపై సోమవారం రాత్రి కళాజాత బృందం అవగాహన కల్పించింది. అదేవిధంగా పోలీసుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా మండలంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ రవి కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్, గంజాయి, ఆన్లైన్ గేమింగ్, సీసీ కెమెరాల ప్రాధాన్యత, మహిళలు-చిన్నారుల రక్షణ, సంబంధిత చట్టాలపై అవగాహన కల్పించారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు...