బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా సత్యనారాయణ

కాకతీయ, లక్షెట్టిపేట : బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన గాండ్ల సత్యనారాయణను జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ కక్షిదారులకు సేవలందించే క్రమంలో బార్ అసోసియేషన్ మార్గదర్శకంగా ఉండాలన్నారు. పెండింగ్ కేసులను వీలైనంత మేరకు న్యాయవాదులు రాజీ మార్గం ద్వారా పరిష్కారమయ్యేలా కృషి చేయాలని సూచించారు. గత బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కొమిరెడ్డి సత్తన్నకు, గాండ్ల సత్యనారాయణకు సమానంగా ఓట్లు పోల్ కావడంతో నిబంధనల మేరకు ఆరు నెలల చొప్పున పదవీ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు....