దివ్యాంగులకు సేవ చేయడం అభినందనీయం
కలెక్టర్ పమేలా సత్పతి తిమ్మాపూర్ పీహెచ్‌సీ తనిఖీ కాకతీయ, కరీంనగర్ : స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లోని మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల, వృత్తి విద్యా శిక్షణ కేంద్రానికి నూతన బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని బస్సును ప్రారంభించారు. రూ.26 లక్షలతో శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఈ బస్సును అందజేసింది. కలెక్టర్ విద్యార్థులతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఆమె మాట్లాడుతూ.. మానసిక వికలాంగుల...