మెంథా తుఫాన్’ జాగ్రత్తలు పాటించండి

తహసీల్దార్ ఎమ్డీ రియాజుద్దీన్ కాకతీయ, గీసుగొండ : మెంథా తుఫాన్‌ ప్రభావంతో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని గీసుగొండ తహసీల్దార్ ఎమ్డీ రియాజుద్దీన్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మండల ప్రజలకు పలు సూచనలు చేశారు. వర్షాల కారణంగా పొలాల్లో నీరు నిల్వ కాకుండా చూసుకోవాలన్నారు. పశువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచుకోవాలని తెలిపారు. విద్యుత్‌ తీగలు, చెరువులు, వాగులు వంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం...