అవినీతి రహిత పాలనే లక్ష్యం
ములుగు కలెక్టర్ దివాకర కాకతీయ, ములుగు ప్రతినిధి : రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అవగాహన పోస్టర్లను కలెక్టర్ దివాకర ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు, విజిలెన్స్ సిబ్బందితో కలిసి అవినీతి నిరోధక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అధికారి, ఉద్యోగి తమ బాధ్యతలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అవినీతి రహిత పాలన సాధనలో ప్రతి ఒక్కరి పాత్ర...