జోరుగా అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారం

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలోని నిర్మల భరోసా ప్యానల్ వేగంగా దూసుకుపోతోంది. రోజురోజుకీ సభ్యుల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. నిజాయితీ, నీతిమంతమైన పాలనతో బ్యాంకును నూతన దిశగా నడిపించేందుకు తాను సన్నద్ధమని రాజేందర్ రావు స్పష్టం చేశారు. కరీంనగర్ డిసిసి అధ్యక్ష పదవి రేసులోనూ ముందంజలో ఉన్న ఆయన, అర్బన్ బ్యాంక్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమ ప్యానల్ గెలుపుతో బ్యాంకులో పారదర్శకత...