తుపాన్ ప్రభావంపై సీఎం రేవంత్ ఆరా
తుపాన్ ప్రభావంపై సీఎం రేవంత్ ఆరా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలి ఎన్డీఆర్ ఎఫ్ బృందాలకు కలెక్టర్లు మార్గనిర్దేశం చేయాలి క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు కాకతీయ, హైదరాబాద్ : మొంథా తుపాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను బుధవారం ఆరా తీశారు. వరి కోతల సమయం కావడం... పలు చోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం...