కరీంనగర్ టవర్ సర్కిల్‌లో అగ్ని ప్రమాదం.
కరీంనగర్ టవర్ సర్కిల్‌లో అగ్ని ప్రమాదం. అగ్నిమాపక సిబ్బంది గంటలపాటు శ్రమ అదుపులోకి మంటలు. కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని ప్రధాన వ్యాపార ప్రాంతమైన టవర్ సర్కిల్‌లో బుధవారం ఉదయం భయానక అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టవర్ సర్కిల్ రోడ్డుపై ఉన్న ‘కపిల్ డ్రెస్సెస్’ దుస్తుల షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. షాపులో ఉన్న వస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోవడంతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. కొద్ది సేపట్లోనే మంటలు పక్కనే ఉన్న ఫోటో స్టూడియో వెడ్డింగ్ డెకరేషన్ సామగ్రి...