సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
ముమ్మరంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులు విద్య, క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాకతీయ, పినపాక: పేదవాడికి కూడు, గూడు కల నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పినపాక మండలంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 8, 9, 10 తేదీలలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఐలాపురం కస్తూరిబా బాలికల పాఠశాలను పరిశీలించారు. ఈ బయ్యారం క్రాస్ రోడ్ జీవీఆర్...