లక్ష్మినరసింహ దవాఖానలో దారుణం
వైద్యుల నిర్లక్ష్యంతో పాప మృతి! దవాఖాన ఎదుట బాధితుల ఆందోళన యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం కాకతీయ, తెలంగాణ బ్యూరో : హన్మకొండ లక్ష్మినరసింహ దవాఖానలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో తమ పాప మృతి చెందిందని తండ్రి హుజురాబాద్‌కు చెందిన ఎదురుగట్ల శ్రీనాథ్ ఆరోపించారు. పాప ఆరోగ్యంగానే ఉందంటూ వైద్యులు నమ్మబలికారని, ఇప్పటి వరకు తమతో లక్ష యాభై వేల రూపాయల బిల్లు కట్టించారని ఆవేదన వ్యక్తంచేశారు. పాప మృతికి ఆసుపత్రి వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమని ఆసుపత్రి ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు....