అన్నదాతలు ఆందోళన చెందవద్దు
వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాకతీయ, కరీంనగర్ : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా ఇచ్చారు. గంగాధర వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గంగాధర, మంగపేట, ఇస్లాంపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల వివరాలను నమోదు చేసుకొని తేమ శాతం వచ్చిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు...