రాజకీయాలకు అతీతంగా రైతులను ఆదుకోవాలి

బండి సంజయ్‌ను కోరిన మంత్రి ప్రభాకర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పొన్నం పర్యటన బస్వాపూర్, పోరెడ్డిపల్లి, అక్కెనపల్లి ప్రాంతాల్లో పంటల పరిశీలన కాకతీయ, కరీంనగర్ : హుస్నాబాద్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం పర్యటించారు. వరద ఉధృతికి తెగిపోయిన రోడ్లు, కొట్టుకుపోయిన కల్వర్టులు, దెబ్బతిన్న పంటలను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. కోహెడ మండలంలోని బస్వాపూర్, పోరెడ్డిపల్లి, అక్కెనపల్లి గ్రామాల్లో మోయతుమ్మెద వాగు ఉధృతికి తెగిపోయిన బ్రిడ్జీలు, ముంపు ప్రాంతాలను మంత్రి పరిశీలించారు....