పంటలకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలి

బీజేపీ మండల అధ్యక్షుడు తడుక వినయ్ కాకతీయ, నల్లబెల్లి : మొంథా తుపాను ప్రభావంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారని, దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం తక్షణ నష్టపరిహారం అందించాలని బీజేపీ మండల అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలతో పాటు వెన్నుదశలో ఉన్న పంటలు నేలకొరిగి నీటిలో మునిగిపోయాయని తెలిపారు. దీని ఫలితంగా రైతులు ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన...