అధికారులు అప్రమత్తంగా ఉండాలి
వర్షాలతో కలిగిన నష్టంపై కలెక్టర్ సమీక్ష కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల పంటలకు, ఆస్తులకు జరిగిన నష్టంపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉన్నతాధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వర్షాల కారణంగా 8 పశువులు మృతి చెందినట్లు సమాచారం అందిందని, వాటి యజమానులకు వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి...