జోరుగా కల్తీ,నిలువ ఉంచిన ఆహార పదార్థాల విక్రయాలు

కాకతీయ, లక్షెట్టిపేట : పట్టణంలోని పలు స్వీట్ హౌస్ లు,బేకరీలు,చైనీస్ ఫుడ్ సెంటర్లు,హోటళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదని ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి.ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్న,అలాంటి వాటి వైపు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఉంది.కలుషిత ఆహారం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది,కాలం చెల్లిన తినుబండారాలు,స్వీట్లు,బేకరీ పదార్థాలు తిని చాలామంది అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.పాడైన ఆహార పదార్థాలు తినడం వల్ల, విరేచనాలు,వాంతులు, గ్యాస్టిక్,ఉదర సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు.సాయంత్రం 5...