కపిల్ బాలకుటీర్ లో స్వచ్ఛభారత్

కాకతీయ, కరీంనగర్ : జిల్లాకేంద్రంలోని కపిల్ బాలకుటీర్ సీసీఐ హోమ్‌లో గురువారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఐ హోమ్‌ను సిడబ్ల్యుసి సభ్యుడు కళింగ శేఖర్, డిసిపిఓ పర్వీన్, డిసిపియు పూదరి శాంత సందర్శించి, మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. హోమ్ నిర్వహణ తీరుపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రతలోనే ఆరోగ్యం ఉందని అన్నారు. విద్యార్థులు లక్ష్యంతో...