‘రన్ ఫర్ యూనిటీ’కి విశేష స్పందన
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమం విజయవంతమైంది. సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని, ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ (జాతీయ ఐక్యతా దినోత్సవం) సందర్భంగా 5 కిలోమీటర్ల మేర ఈ పరుగు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కాళోజీ అవార్డు విజేత నలిమెల భాస్కర్, దాశరథి అవార్డు గ్రహీత అన్నవరం దేవేందర్ హాజరయ్యారు. పరుగులో విద్యార్థులు, యువత, క్రీడాకారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది...