ఆడపిల్లలను వేధిస్తే వదిలేది లేదు

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాకతీయ, కరీంనగర్ : మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను వేధించిన ఘటనపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడిన ఆయన, ఆడపిల్లలను వేధించే వారెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సమస్యపై సమాచారం అందగానే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి నిమిషాల్లోనే నిందిత అటెండర్‌, నిర్లక్ష్యం వహించిన హెడ్‌మాస్టర్‌పై సస్పెన్షన్‌ చర్యలు తీసుకునేలా చేమని తెలిపారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలపై విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకున్న...