అంచనాలు కాదు.. పరిహారమివ్వండి

అతివృష్టితో రైతులకు తీవ్ర నష్టాలు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హేమంతరావు కాకతీయ, ఖమ్మం : రైతాంగం దెబ్బతిన్న ప్రతిసారి పంటల నష్టపరిహారం అంచనా వేయడం వరకే ప్రభుత్వం పరిమితమవుతుందని, పరిహారం పరిహాసంగా మారుతుందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు బాగం హేమంతరావు ఆరోపించారు. ప్రకృతి విపత్తు ఏర్పడిన ప్రతిసారి పాలకులు పంటల అంచనాలంటూ ప్రకటనలకే పరిమితమవుతున్నారన్నారు. రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఖమ్మంలో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేష్ అధ్యక్షత జరుగగా ముఖ్య అతిథిగా హేమంతరావు హాజరై...