గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకే ల‌బ్ధి

ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవం కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పేరిట కాంట్రాక్టర్లు మాత్రమే లాభ పడ్డారని, ప్రజలకు ఎలాంటి న్యాయం జరగ లేదని ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో నూత‌న‌ సమీకృత కూరగాయల మార్కెట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలోకూరగాయల మార్కెట్ నిర్మాణానికి కోట్ల రూపాయలు కేటాయిస్తే కేవలం లాభాలు వచ్చే వరకు మాత్రమే కాంట్రాక్టర్లు పనులు చేశారని ఆరోపించారు....