అనధికార హోర్డింగుల తొలగింపు

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో సుమారు 220 అనధికార హోర్డింగ్స్‌, ఫ్లెక్సీలు, ప్రచార బోర్డులు తొలగించారు. పాదచారుల రాకపోకలకు ఆటంకం రాకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, నగర శుభ్రత, అందాన్ని కాపాడేందుకు ఈ చర్య చేపట్టినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఇకముందు మున్సిపల్‌ అనుమతి లేకుండా ఫుట్‌పాత్‌లు, రహదారులు, జంక్షన్‌లు లేదా ప్రజా ప్రదేశాల్లో ఏవైనా హోర్డింగ్స్‌, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే తక్షణమే తొలగించడమే కాక, జరిమానాలు, చట్టపరమైన చర్యలు...