ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలి
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి కాకతీయ, నల్లబెల్లి : మొంథా తుఫాన్ ప్రభావంతో నల్లబెల్లి మండలంలోని పలు గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి అన్నారు. మండలంలోని ధర్మరావుపల్లి, రంగాపూర్, మామిం డ్ల, వీరయ్యపల్లి, బోల్లోనిపల్లి, నాగరాజుపల్లి, రేలుకుంట, ముచింపుల్ల తండ గ్రామాల్లో పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి, పత్తి, మిర్చి పంటలు పూర్తిగా నాశనమయ్యాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేసి ఎకరానికి యాభై వేల పరిహారం...