నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కాకతీయ, కరీంనగర్ : జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో వర్షం వల్ల నష్టపోయిన పంట పొలాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. మెంథా తుఫాన్ రైతుల కళ్లలో కన్నీరు మిగిల్చిందని, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని గంగాడి కోరారు. చేతికి వచ్చిన పంట నీటిపాలైందని, అనేక ప్రాంతాల్లో...