పేదల పక్షపాతి కాంగ్రెస్

కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పార్టీ కార్యాల‌యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కాకతీయ, హుజురాబాద్ : కాంగ్రెస్ పార్టీ పేద‌ల ప‌క్ష‌పాతిగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం హుజురాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో రూ.47,62,000 విలువగల 135 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ పేదవారిపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ కాంగ్రెస్సేన‌ని అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో ఎలాంటి జాప్యం వహించం, చెక్కులు వచ్చిన వెంటనే లబ్ధిదారుల...