గీత వృత్తిలో ఉపాధి కల్పించాలి
కాకతీయ, నర్సింహులపేట : కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాదిమందికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం (కేజీకేఎస్) మండల అధ్యక్షుడు డొనికెన రామన్న అన్నారు. పడమటిగూడెం గ్రామంలో శ్రీకంఠమహేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కల్లుగీత కార్మిక సంఘం మూడో జిల్లా మహాసభల కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే మహాసభలకు గౌడ కులస్తులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. గీత వృత్తిలో ప్రమాదానికి గురైన 710...