రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలి

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎర్రబెల్లి త్వరగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాకతీయ, రాయపర్తి/పర్వతగిరి: భారీ వర్షాలతో పంట నష్టం వాటిల్లిన రైతులకు తక్షణమే నష్టపరిహారాన్ని అందించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పర్వతగిరి మండలం కొంకపాక గ్రామంలో శనివారం ఎర్రబెల్లి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితేల సతీష్ తో కలిసి వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన వినతి...