ఆర్గనైజర్లతో రైతులు అప్రమత్తంగా ఉండాలి
మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ బాబు కాకతీయ, గీసుగొండ : రైతులు లైసెన్స్ ఉన్న డీలర్ వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, లేబుల్ లేని విత్తనాలను కొనరాదని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే తమకు తెలియజేయాలని మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ బాబు సూచించారు. మండలంలోని రైతులు అనుమతిలేని మేల్–ఫీమేల్ విత్తన ఆర్గనైజర్ల నుండి అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు హెచ్చరించారు. ఇటీవల కొందరు మేల్–ఫీమేల్ మొక్కజొన్న విత్తనాలు, వరి ఆర్గనైజర్ల పేరుతో గ్రామాల్లో తిరుగుతున్నారు. రైతులకు విత్తనాలు అమ్మడానికి, హైబ్రిడ్ విత్తన...